logo

నిర్వాసితులకు అండగా ఉంటాం

పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. రేఖపల్లిలో ఆదివారం పునరావాస కాలనీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరావాస కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు.

Published : 03 Oct 2022 01:40 IST

పునరావాస కాలనీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

వరరామచంద్రపురం, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. రేఖపల్లిలో ఆదివారం పునరావాస కాలనీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పునరావాస కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. శ్రీరామగిరి సర్పంచి సంతోష్‌, ఎంపీపీ లక్ష్మి ఎమ్మెల్యే దృష్టికి నిర్వాసితుల సమస్యలు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తి చెంది సర్పంచి, ఎంపీపీ వేదిక నుంచి దిగిపోయారు. జడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే ఎదుట సమస్యల ఏకరవు

ఎటపాక, న్యూస్‌టుడే: రాయనపేట గ్రామ సచివాలయ పరిధిలో ఆదివారం ఎమ్మెల్యే ధనలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. పాతకొడిపల్లి, కొత్తకొడిపల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్‌ ప్రజా ప్రతినిధులనే నేరుగా ప్రజల వద్దకు పంపుతున్నారన్నారు. వరద బాధితులు తమ సమస్యలను ఎమ్మెల్యే వద్ద ఏకరవు పెట్టారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని