logo

మూడున్నరేళ్లుగా విధ్వంస పాలన: తెదేపా

రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా విధ్వంస పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ ఆరోపించారు. పాడేరులోని పాత బస్టాండు కూడలి వద్ద తెదేపా ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారంతో ముగిశాయి.

Published : 03 Oct 2022 01:40 IST

పాడేరులో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి,

పాడేరు నియోజకవర్గ పరిశీలకుడు నారాయణ, నాయకులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా విధ్వంస పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తెదేపా నియోజకవర్గ పరిశీలకుడు రాజమండ్రి నారాయణ ఆరోపించారు. పాడేరులోని పాత బస్టాండు కూడలి వద్ద తెదేపా ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే దీక్షలు ఆదివారంతో ముగిశాయి. అంతకుముందు పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి తెదేపా నాయకులు పాలాభిషేకం చేశారు. 11 అంశాలతో విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఈశ్వరి, నారాయణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం తుంగలో తొక్కారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా కనీసం అధికార పార్టీ నాయకులు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా గెలుపునకు సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలుగు ప్రజలకు గుర్తింపు తీసుకొచ్చిన ఎన్టీఆర్‌ పేరును ఆరోగ్య విశ్వవిద్యాలయానికి తొలగించడం హేయమన్నారు. తెదేపా సీనియర్‌ నాయకులు కొట్టగుళ్లి సుబ్బారావు, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు పొలుపర్తి గోవిందరావు, పాడేరు సర్పంచి ఉషారాణి, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సురేష్‌కుమార్‌, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి సింహాచలం, నాయకులు పూర్ణచంద్రరావు, కొండలరావు, రమేష్‌, శివకుమార్‌, జ్యోతికిరణ్‌, అల్లంగి సుబ్బాలక్ష్మి, బూరెడ్డి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని