logo

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు దారుణం: తెదేపా

పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమని తెదేపా మండల అధ్యక్షుడు కారం సురేష్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు.

Published : 03 Oct 2022 01:40 IST

చింతపల్లి, రంపచోడవరంలో తెదేపా నాయకుల నిరసన

రంపచోడవరం, న్యూస్‌టుడే: పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమని తెదేపా మండల అధ్యక్షుడు కారం సురేష్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. సమస్యలపై గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు. నిరంజనీదేవి, అనంతమోహన్‌, సింహాచలం, బాపన్నదొర తదితరులు పాల్గొన్నారు.

ఎటపాక: గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యానికి వైకాపా ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని తెదేపా మండల అధ్యక్షుడు పుట్టి రమేష్‌ ఆరోపించారు. నెల్లిపాక జాతీయ రహదారి పక్కన గాంధీ విగ్రహానికి సర్పంచి భద్రమ్మ ఆధ్వర్యంలో  వినతిపత్రం ఇచ్చారు.

చింతపల్లి గ్రామీణం: చింతపల్లిలో గాంధీ విగ్రహం వద్ద తెదేపా అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. లక్ష్మణరావు, ఆనంద్‌, బేతాళుడు, వెంగళయ్య  పాల్గొన్నారు.

జోలాపుట్టులో ర్యాలీగా వస్తున్న నాయకులు, కార్యకర్తలు

హుకుంపేట: మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల ప్రధాన కూడలి వద్ద మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, పలువురు సర్పంచులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. తెదేపా నాయకులు తులసీరావు, సత్యనారాయణ, సుబ్బారావు, వెంకటరమణరాజు తదితరులు పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: గిరిజన ఉప ప్రణాళిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి వేరే పథకాలకు వినియోగించడం తగదని అరకు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి శాస్త్రిబాబు అన్నారు. ఆదివారం జోలాపుట్టులో నిర్వహించిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వం గిరిజన ప్రాంత అభివృద్ధిని విస్మరించిందని అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గెలవడం ఖాయమని, తెదేపా గెలుపుతోనే అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన అన్నారు. మండల నాయకులు రామస్వామి, నీలకంఠం, రామదాసు, వారణాసి. ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని