logo

పసర మందు పట్టడంతో చిన్నారికి అస్వస్థత

పసర మందు పట్టిన చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి కిల్లో సౌజన్యకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలో నాటువైద్యం చేయించి పసర మందు పట్టించారు.

Published : 03 Oct 2022 01:40 IST

చిన్నారిని అంబులెన్సులో నర్సీపట్నం  ఆసుపత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పసర మందు పట్టిన చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. అన్నవరం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన రెండేళ్ల చిన్నారి కిల్లో సౌజన్యకు మూడు రోజుల క్రితం జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గ్రామంలో నాటువైద్యం చేయించి పసర మందు పట్టించారు. దీంతో చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆదివారం చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యాధికారి హిమబిందు ప్రథమ చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆక్సిజన్‌ పెట్టి అంబులెన్సులో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యాధికారి మాట్లాడుతూ చింతపల్లి ఆసుపత్రిలో చిన్నారుల చికిత్స కోసం ఎస్‌ఎన్‌సీయూ అందుబాటులో ఉందని, చిన్నపిల్లల వైద్యనిపుణులూ ఉన్నారన్నారు. పిల్లలకు ఎట్టి పరిస్థితిలోనూ పసర మందు పట్టించవద్దని కోరారు. దీని వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. చిన్నారులు అనారోగ్యానికి గురైతే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకురావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని