logo

కుంకంపూడి కొండలో కొత్త గుహలు

మన్యం సహజసిద్ధ అందాలకు నిలయం. ఎప్పటికప్పుడు ఇక్కడ కొత్త అందాలు వెలుగులోకి వస్తున్నాయి. గూడెంకొత్తవీధి మండలం కుంకంపూడి కొండపై ఆరు గుహలు కొత్తగా వెలుగు చూశాయి.

Published : 04 Oct 2022 02:38 IST


వెలుగు చూసిన గుహ

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: మన్యం సహజసిద్ధ అందాలకు నిలయం. ఎప్పటికప్పుడు ఇక్కడ కొత్త అందాలు వెలుగులోకి వస్తున్నాయి. గూడెంకొత్తవీధి మండలం కుంకంపూడి కొండపై ఆరు గుహలు కొత్తగా వెలుగు చూశాయి. సుమారు 80 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహలను గూడెంకొత్తవీధికి చెందిన యువకుల బృందం బయటపెట్టింది. గూడెంకొత్తవీధి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోని తీములబంద, కుంకంపూడి గ్రామాల మధ్య ఉన్న ఈ కొండపై గుహలు ఉన్నట్లు గూడెంకొత్తవీధికి చెందిన యువకులకు సమాచారం అందింది. కొర్ర నారాయణరావు, లకే రామచంద్రుడు, పూజారి లీలాప్రసాద్‌, శంకర్‌రావు, కాళీచరణ్‌, వంతల వరప్రసాద్‌ బృందంగా ఏర్పడి ఈ కొండపైకి సోమవారం ఉదయం బయల్దేరారు. తీములబంద దాటాక మొదటి మలుపు నుంచి కుడివైపుగా కాఫీతోటల మీద నుంచి కొండపైకి వెళ్లారు. సుమారు 80 అడుగుల ఎత్తుకు వెళ్లాక ఆరు గుహలు కనిపించాయి. వాటిలో కొన్ని రాళ్లతో మూసివేసి ఉన్నాయి. కొన్నింటి లోపలకు వెళ్లి అక్కడి చిత్రాలను కెమెరాల్లో బంధించారు. ఈ గుహలను అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం మరింతగా ప్రాచుర్యంలోకి వస్తుందని యువకులు పేర్కొన్నారు.


గుహలోపలకు వెళ్లొచ్చిన గూడెంకొత్తవీధి యువకులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని