logo

నారు కోసి.. ముక్కలుగా చేసి..

గోదావరి వరదలు విలీన మండలాల రైతులను నిలువునా ముంచేశాయి. సహజంగా మిర్చి నారును మడుల్లో 40 రోజులు పెంచి నాట్లకు వినియోగిస్తారు.

Published : 04 Oct 2022 02:38 IST


నారును అడుగు మేర కోస్తున్న కూలీలు

కూనవరం, న్యూస్‌టుడే: గోదావరి వరదలు విలీన మండలాల రైతులను నిలువునా ముంచేశాయి. సహజంగా మిర్చి నారును మడుల్లో 40 రోజులు పెంచి నాట్లకు వినియోగిస్తారు. ఈ సమయానికి అవి సుమారు అడుగు మేర ఎదిగి నాట్లకు సిద్ధంగా ఉంటాయి. మూడు నెలలపాటు సాగు భూముల్లో వరద నీరు ఉండడంతో నాట్లు ఆలస్యం అయ్యాయి. ఫలితంగా నారుమడుల్లోని నారు మూడడుగుల మేర ఎదిగి పూత, కాతతో ఉన్నాయి. సాగుదారులు ఏమి చేయాలో తెలియక ఆ మూడడుగులు ఎదిగిన మొక్కలనే అడుగు ఉండేలా కత్తిపీటల సాయంతో కోస్తున్నారు. అలా మిగిలిన అడుగు ముక్కలనే నాటుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో నారు దొరకదని, తప్పని పరిస్థితుల్లో ఇలా చేస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు ఎనిమిది వేల నుంచి పదివేల మొక్కల వరకు పడతాయని, అంత నారు మరోసారి కొనలేక ఈ పద్ధతి అనుసరిస్తున్నట్లు చెప్పారు. దిగుబడులు ఎలా వస్తాయోనన్న ఆందోళన ఉన్నా తప్పక సాహసిస్తున్నారు.


ఇలా కోసిన ముక్కలనే నారుగా వాడుతున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని