logo

పీహెచ్‌సీకి సమకూరిన గేటు

వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన నాడు-నేడు పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి.

Published : 04 Oct 2022 02:38 IST


డుంబ్రిగుడ పీహెచ్‌సీ ప్రహరీకి ఏర్పాటు చేసిన గేటు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టిన నాడు-నేడు పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. డుంబ్రిగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నాడు-నేడు నిధులు రూ. 90లక్షలతో చేపట్టిన ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయని అధికారులు తప్పుడు నివేదికలు అందించారు. నిరంతర నీటి సదుపాయం, ప్లంబింగ్‌ పనులు, ఆసుపత్రి ముఖద్వారానికి గేటు ఏర్పాటు చేయని తీరుపై గతనెల 30న ’నాడు-నేడు.. పట్టదా రోగుల గోడు’ అనే శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. డుంబ్రిగుడ ఆరోగ్య కేంద్రానికి ముఖద్వారానికి గేటు ఏర్పాటు చేశారు. దీంతో ఆకతాయిలు, పశువుల బెడద తీరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని