logo

అసంపూర్తి వంతెనతో అవస్థలు

పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి కోట్లగరువు సమీపంలో వంతెన నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఇక్కడ పనులు ప్రారంభించారు.

Published : 04 Oct 2022 02:38 IST


వంతెన వద్ద గుంతలో దిగిన కారు

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు నుంచి మైదాన ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి కోట్లగరువు సమీపంలో వంతెన నిర్మాణం అసంపూర్తిగా వదిలేయడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఇక్కడ పనులు ప్రారంభించారు. వంతెనకు ఇరువైపులా కంకర అమర్చి మట్టి పటుత్వం కోల్పోకుండా దట్టించాలి. అలా కాకుండా కేవలం మట్టిని పేర్చి వదిలేశారు. వర్షపు నీటి ఉద్ధృతికి వంతెనకు ఇరువైపులా ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో చుట్టూ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో కార్లు, ఇతర వాహనాలు ఇక్కడ దిగబడుతున్నాయి. సోమవారం పాడేరు వైపునకు వస్తున్న ఓ కారు గుంతలో చిక్కుకుంది. ఇక్కడ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని