logo

తెదేపాతోనే సుపరిపాలన: శ్రావణ్‌

రాష్ట్రానికి సుపరిపాలన తెదేపాతోనే సాధ్యమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్పును నిరసిస్తూ సోమవారం పెదబయలు అంబేడ్కర్‌ కూడలిలో మండల తెదేపా అధ్యక్షురాలు సుకుమారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.

Published : 04 Oct 2022 02:38 IST


పెదబయలులో దీక్ష చేస్తున్న మాజీ మంత్రి శ్రావణ్‌

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్రానికి సుపరిపాలన తెదేపాతోనే సాధ్యమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ కుమార్‌ అన్నారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు మార్పును నిరసిస్తూ సోమవారం పెదబయలు అంబేడ్కర్‌ కూడలిలో మండల తెదేపా అధ్యక్షురాలు సుకుమారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలి అరాచక పరిపాలన సాగిస్తోందన్నారు. ప్రభుత్వానికి చేతనైతే వైద్య కళాశాల, ఐఐటీలు కొత్తగా ఏర్పాటుచేసి పేర్లు పెట్టుకోవాలని సూచించారు. ఉన్న పేర్లను మార్చడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ లేదని, మద్యపాన నిషేధం, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయలేదని, ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్‌ గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను మళ్లించడానికే విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టారన్నారు. నిరసన దీక్షకు మద్దతుగా వంతాల నాగేశ్వరరావు, సాగర సుబ్బారావు, కొర్రా నాగేశ్వరరావు, వెచ్చంగి కొండయ్య, మాజీ సర్పించి త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని