logo

సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ మేలు

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ మేలు జరుగుతోందని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా కాడెలి, వర్తనపల్లి పంచాయతీల్లో మంగళవారం ఆమె పర్యటించారు.

Published : 05 Oct 2022 02:47 IST

పేదల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే, వైస్‌ ఎంపీపీ

పాడేరు, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలందరికీ మేలు జరుగుతోందని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా కాడెలి, వర్తనపల్లి పంచాయతీల్లో మంగళవారం ఆమె పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు. సాంకేతిక సమస్యలతో పథకాలు అందకపోయినా వీటిని సరిదిద్ది అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామన్నారు. వైకాపా నాయకులు బసవన్నదొర, బుల్లేశ్వరి, పార్వతమ్మ, ప్రభావతి, రామకృష్ణపాత్రుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

* పాడేరు పట్టణంలో మెయిన్‌ రోడ్డులో దుర్గాదేవి ఉత్సవ మండపం వద్ద  భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి బాలరాజు, ఆరోగ్య సలహా మండలి సభ్యుడు డాక్టర్‌ నర్సింగరావు, ఉప సర్పంచి రామునాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

పేదలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
హుకుంపేట, న్యూస్‌టుడే: పేదలకు వైకాపా నిత్యం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ పేర్కొన్నారు. ములయాపుట్టు పంచాయతీ పాటిమామిడి, బర్మాన్‌గూడ, మొట్టుమామిడి, కంగారుపుట్టు, కులపాడు, భీరం గ్రామాల్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యాక్రమం నిర్వహించారు జోగులపుట్టులో రూ.10లక్షలతో నిర్మించిన అంగన్‌వాడీ భవనం ప్రారంభించారు. గ్రామంలో తిరుగుతూ వారి సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలును తెలుసుకున్నారు. గ్రామాల్లో చిన్న చిన్న పొరపాట్లతో కొందరికి పింఛన్లు రద్దయ్యాయని, వాటిని సరిచేసి అందరికీ అందించాలని కోరారు.  కార్యక్రమంలో ఎంపీపీ రాజుబాబు, జడ్పీటీసీ సభ్యుడు మత్య్సలింగం, వైస్‌ ఎంపీపీ ప్రియాంక, ఎంఈఓ రామచంద్రరావు, సీడీపీవో మణి, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని