logo

ఘనంగా షిరిడీ సాయిబాబా జయంతి వేడుకలు

సీలేరులో ఆరు రోజులుగా జరుగుతున్న షిరిడీ సాయిబాబా జయంతి వేడుకలు మంగళవారంతో ముగిశాయి. తెల్లవారుజామున నగర సంకీర్తన, ఉదయం నుంచి సత్యవ్రతాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు జరిపారు.

Published : 05 Oct 2022 02:47 IST

రంపచోడవరంలోని మందిరంలో సాయిబాబా

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరులో ఆరు రోజులుగా జరుగుతున్న షిరిడీ సాయిబాబా జయంతి వేడుకలు మంగళవారంతో ముగిశాయి. తెల్లవారుజామున నగర సంకీర్తన, ఉదయం నుంచి సత్యవ్రతాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు జరిపారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎస్‌ఈ కేకేవీ ప్రశాంత్‌కుమార్‌, డీఈఈ అప్పలనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు సాంబమూర్తి, పిల్లా రమణబాబు, బి.లక్ష్మణరావు, ఎన్‌.గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.
రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక సాయిబాబా ఆలయంలో అర్చకులు అద్దంకి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్థ ఏకాహం నిర్వహించారు. ఈ నెల 6న ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని అర్చకుడు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని