logo

సైబర్‌ నేరాలపై జాగ్రత్త అవసరం

సైబర్‌ నేరాలపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ అన్నారు. బొండాంలో మంగళవారం రుణ యాప్‌లు, పలు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

Updated : 05 Oct 2022 06:27 IST

బొండాంలో ప్రజలతో  మాట్లాడుతున్న ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌

అరకులోయ, న్యూస్‌టుడే: సైబర్‌ నేరాలపై ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ అన్నారు. బొండాంలో మంగళవారం రుణ యాప్‌లు, పలు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణ యాప్‌లు, సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చే అనుమానాస్పద నంబర్లని ఎప్పుడూ తెరవరాదన్నారు. అనుమానాస్పద ఫోన్‌ కాల్‌లపై జాగ్రత్తగా ఉండాలన్నారు. గ్రామాల్లో నేరాలు చోటు చేసుకోకుండా ప్రజలు చైతన్యవంతం కావాలన్నారు. నాటుసారా తయారీకి ప్రజలు దూరంగా ఉండాలని ఆయన కోరారు. సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని