logo

ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ.. నిలిచిన తాగునీటి సరఫరా

బొర్రా పంచాయతీ ములియగుడ గ్రామంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేయడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది.

Published : 05 Oct 2022 02:47 IST

గెలియ నీటిని సేకరిస్తున్న ములియగుడ మహిళలు

అనంతగిరి, న్యూస్‌టుడే: బొర్రా పంచాయతీ ములియగుడ గ్రామంలో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్‌ను గుర్తు తెలియని దుండగులు చోరీ చేయడంతో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వారం రోజులుగా మోటారు బోరు ద్వారా అందుతున్న నీటి సరఫరా నిలిచిపోయింది. గత్యంతరం లేక కిలోమీటరు దూరంలోని ఊటగెడ్డలోని కలుషిత నీటితో దాహార్తిని తీర్చుకుంటున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరాను పునరుద్ధరించాలని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని