logo

గుడిస కొండపై పర్యటకుల సందడి

మారేడుమిల్లి మండలంలోని ప్రముఖ పర్యటక ప్రదేశం గుడిస కొండపైకి సందర్శకులు క్యూ కడుతున్నారు. దసరా సెలవులతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు.

Published : 05 Oct 2022 02:47 IST

గుడిస కొండపై పర్యటకులు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి మండలంలోని ప్రముఖ పర్యటక ప్రదేశం గుడిస కొండపైకి సందర్శకులు క్యూ కడుతున్నారు. దసరా సెలవులతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఇక్కడి ప్రకృతి రమణీయత, సహజసిద్ధమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. పర్యటకులు పోటెత్తడంతో మారేడుమిల్లి ప్రాంతంలో కాటేజీలు, రిసార్టులు, అతిథిగృహాలు నిండిపోయి వసతి కొరత ఏర్పడుతోంది. బొంగుచికెన్‌, బొంగుబిర్యానీ దుకాణాలు కొనుగోళ్లతో సందడిగా మారాయి.
మోతుగూడెం: లోయరు సీలేరు ప్రాజెక్టు పరిధిలో ఐదు రోజులుగా భిన్న వాతావరణం నెలకొంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండ కాస్తోంది. ఆ తర్వాత ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పొగమంచు గ్రామాలను కమ్మేసింది.


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts