ఉత్సాహం దండి.. ప్రోత్సాహం లేదండి!
క్రీడలు.. ఎంతో మందికి జీవితాన్నిస్తాయి. మైదానంలో విజేతలైనా, కాకపోయినా జీవితంలో రాణిస్తారు. తరగతి గదుల్లో నేర్చుకోని ఎన్నో విషయాలను క్రీడా ప్రాంగణాలు నేర్పిస్తాయి.
బాక్సింగ్ క్రీడాకారులకు వసతుల లేమి
నర్సీపట్నం అర్బన్, కొయ్యూరు, న్యూస్‌టుడే
బాక్సింగ్‌లో మెలకువలు నేర్పుతున్న సీనియర్ కోచ్ శేఖర్
క్రీడలు.. ఎంతో మందికి జీవితాన్నిస్తాయి. మైదానంలో విజేతలైనా, కాకపోయినా జీవితంలో రాణిస్తారు. తరగతి గదుల్లో నేర్చుకోని ఎన్నో విషయాలను క్రీడా ప్రాంగణాలు నేర్పిస్తాయి. ఆటలపై శ్రద్ధ చూపే వారికి శారీరకంగా, మానసికంగా పెద్దగా సమస్యలుండవు. పది మందితో కలిసి ముందుకెళ్లే స్వభావం, సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం ఉంటుంది. నర్సీపట్నం పరిసర మండలాలతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన అనేకమంది నర్సీపట్నంలోని సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ కళాశాలల్లో చదువుకుంటున్నారు. బాక్సింగ్ సహా పలు యుద్ధ విద్యల్లో తర్ఫీదు ఇచ్చే కోచ్‌లు స్థానికంగా అందుబాటులో ఉండటంతో శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. వీరిని ప్రోత్సహించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది.
నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలోని క్రీడా వికాస కేంద్రంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తుంటారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన అనేక మంది క్రీడాకారులు ఇక్కడున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఆరేడు మండలాలకు చెందిన విద్యార్థినులు రోజూ బాక్సింగ్ నేర్చుకునేందుకు వస్తున్నారు. తర్ఫీదు పొందేందుకు అవసరమైన రింక్ లేకపోవడంతో మైదానంలోనే నేర్చుకుంటున్నారు. వర్షం పడితే ఆవరణ చిత్తడిగా మారుతోంది. ఆ సమయంలో ఇబ్బంది పడాల్సి వస్తోందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాక్సింగ్ శిక్షణకు ముందు వ్యాయామం చేస్తుంటారు. స్టేడియంలో ఓపెన్ జిమ్ ఉన్నా కొన్ని పరికరాలు పాడయ్యాయి. వాకింగ్ ట్రాక్ కొన్నిచోట్ల పగుళ్లిచ్చింది. నడక మార్గాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయించడం లేదు. చింతపల్లి, గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాలకు చెందిన 21 మంది గిరిజన యువతులు రోజూ ఇక్కడ బాక్సింగ్ సాధన చేస్తున్నారు. అవసరమైన గ్లౌజులు, ప్యాడ్స్, బ్యాండేజ్‌లు, బూట్లు, గార్డు హెడ్స్ లేవు. సగం మందికి నింజాస్ అకాడమీ ప్రతినిధులు పాత బ్యాండేజ్‌లు, బూట్లు ఇచ్చారు. మిగతా వారంతా బ్యాండేజ్‌లు కొనుక్కుని తర్ఫీదు పొందుతున్నారు. అవసరమైన స్థలం కేటాయిస్తే రింక్ నిర్మాణానికి నిధుల మంజూరుకు క్రీడాభివృద్ధి సంస్థ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. కనీసం 25 అడుగుల వెడల్పు, 35 అడుగుల పొడవున స్థలముంటే రింక్ ఏర్పాటుకు వీలుంటుంది. స్టేడియంలో స్థలం సమకూర్చాలని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, మున్సిపల్ ఛైర్పర్సన్ ఆదిలక్ష్మికి పలువురు విజ్ఞప్తి చేశారు.
సొంతంగానే కొనుక్కున్నా..
నర్సీపట్నంలో ఇంటర్మీడియట్ చదువుతూ క్రీడా వికాస కేంద్రంలో బాక్సింగ్ శిక్షణకు వస్తున్నా. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మంచి స్పోర్ట్స్ బూట్లు కొనుక్కోలేకపోతున్నా. శిక్షణకు బ్యాండేజ్ తప్పనిసరి కావడంతో దాన్ని కొనుక్కున్నా. జాతీయ స్థాయిలో రాణిస్తే ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుందని శిక్షణకు వస్తున్నా.
- బి.ప్రమీల, బకులూరు, కొయ్యూరు మండలం
స్నేహితులు చెప్పడంతో..
బాలికల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నా. నర్సీపట్నంలో బాక్సింగ్ శిక్షణ ఉచితంగా ఇస్తున్నారని స్నేహితుల ద్వారా తెలిసి వచ్చా. సీనియర్ కోచ్‌ల వద్ద శిక్షణ తీసుకుంటున్నా. బాక్సింగ్ రింక్ ఉంటే శిక్షణకు మరింతగా వీలుంటుంది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. శిక్షణకు అవసరమైన సరంజామా కొనుక్కునే స్థోమత లేదు. చేతులకు వేసుకునే బ్యాండేజ్ రిబ్బను కొనుక్కుని శిక్షణకు వస్తున్నా.
- సీహెచ్ చాముండేశ్వరి, పాలమామిడి, చింతపల్లి మండలం
వానొస్తే బురదే..
ప్రభుత్వ జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నా. నెల రోజుల నుంచి స్టేడియంలో శిక్షణకు వస్తున్నా. రోజూ ఉదయం ఐదు గంటలకు వచ్చి ఏడు గంటల వరకు వ్యాయామం చేసి ఆ తర్వాత బాక్సింగ్ సాధన చేస్తున్నా. గురువారం రాత్రి పెద్ద వర్షం పడింది. ఉదయాన్నే స్టేడియానికి వస్తే ఆవరణ అంతా బురదగా కనిపించింది. క్రీడా వసతులు మెరుగ్గా ఉంటే బాగుంటుంది.
- కె.దుర్గాభవాని, ఛటర్జీపురం, రోలుగుంట
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: శ్రీకాకుళం జిల్లాలో కూలీలపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు దుర్మరణం
-
Politics News
Yuvagalam: వైకాపా సైకోలకు జగన్ లైసెన్స్ : లోకేశ్
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
World News
Malofeev: ఓ రష్యన్ సంపద.. ఉక్రెయిన్ సాయానికి.. అమెరికా కీలక నిర్ణయం!
-
Sports News
IND vs AUS: వారు లేకపోవడం భారత్‌కు లోటే.. ఆసీస్ దిగ్గజం కీలక వ్యాఖ్యలు
-
Politics News
Arvind Kejriwal: ఇదే కొనసాగితే.. అభివృద్ధి ఎలా సాధ్యం?: కేజ్రీవాల్