logo

నేరేడు ఆకుల్లో ఔషధ గుణాలపై అధ్యయనం

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల బి.ఫార్మసీ నాల్గవ సంవత్సరం విద్యార్థులు సమాజానికి ఉపయుక్తంగా ప్రాజెక్టును నిర్వహించారు.

Published : 26 Nov 2022 02:26 IST

ఫార్మసీ విద్యార్థులను అభినందిస్తున్న వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల బి.ఫార్మసీ నాల్గవ సంవత్సరం విద్యార్థులు సమాజానికి ఉపయుక్తంగా ప్రాజెక్టును నిర్వహించారు. తమ ఏడవ సెమిస్టర్‌లో ప్రాక్టీస్‌ స్కూల్‌లో భాగంగా విభాగ ఆచార్యులు, పాలక మండలి సభ్యులు డాక్టర్‌ ఎ.కృష్ణమంజరి పవార్‌ పర్యవేక్షణలో ఆరుగురు విద్యార్థులు నేరేడు ఆకుల్లో ఔషధ గుణాలపై అధ్యయనం జరిపారు. తమ పరిశోధనలో భాగంగా రెండు రకాల ఫ్లవనాయిడ్స్‌ ఉంటాయని గుర్తించారు. దాదాపుగా 50 గ్రాముల నేరేడు ఆకుల పొడిలో కొర్సిటిన్‌ 0.342 మైక్రో గ్రాములు, రూటిన్‌ 1.397 మైక్రోగ్రాములు ఉండటం గమనించారు. ఈ రెండు ఫ్లవనాయిడ్స్‌ డయాబెటిక్‌, క్యాన్సర్‌ నియంత్రణలో ఉపకరిస్తాయి. ఈ అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు నందిని, శ్రీదేవి, అనూష, కళ్యాణ్‌రాజ్‌, సుశితశ్రీ, శిరీషలను వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తన కార్యాలయంలో అభినందించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని