logo

వచ్చే నెలలో పాడేరుకు గవర్నర్‌ రాక

జిల్లావ్యాప్తంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ అందిస్తున్న సేవలకు గౌరవం దక్కింది.

Published : 29 Nov 2022 01:18 IST

రెడ్‌క్రాస్‌ సేవలకు దక్కిన గుర్తింపు

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతులమీదుగా అవార్డు అందుకుంటున్న

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ అందిస్తున్న సేవలకు గౌరవం దక్కింది. రెడ్‌క్రాస్‌ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సోమవారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణకు అవార్డులు అందించి సత్కరించారు. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 2020-21లో శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్‌గా సుమిత్‌కుమార్‌ పనిచేసిన సమయంలో రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలు, ఇతర సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏర్పాటు చేసి విస్తృతంగా సేవలందించినందుకు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణకు అవార్డు అందించారు. పాడేరు యూనిట్‌కు ఒక మహాప్రస్థానం వాహనం మంజూరు చేస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు. భవిష్యత్తులో సేవలు మరింత విస్తరించాలని సూచించారు. వచ్చే నెల పాడేరులో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా రక్తదాన శిబిరానికి హాజరవుతానని గవర్నర్‌ హామీ ఇచ్చారని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని