logo

మన్యంలో మంచు వర్షం

మన్యం ప్రజలను చలి వణికిస్తోంది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Published : 29 Nov 2022 01:18 IST

సంతకు అటవీ ఉత్పత్తులు మోసుకొస్తున్న మహిళలు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: మన్యం ప్రజలను చలి వణికిస్తోంది. జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరు సమీపంలోని మినుములూరు కాఫీ బోర్డు పరిశోధనా కేంద్రం వద్ద సోమవారం 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు కాఫీ బోర్డు  ఎస్‌ఎల్‌ఓ విష్ణు తెలిపారు. గత మూడు రోజుల్లో 16, 13, 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. సోమవారం ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి.


మారేడుమిల్లిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రత  నమోదైంది.  మంచు వాతావరణాన్ని పర్యటకులు ఆస్వాదిస్తున్నారు. స్థానికులు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు.

మారేడుమిల్లి, న్యూస్‌టుడే


చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లిలో 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. ఉదయం వేళల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యటకులు ఇక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని