logo

4588 మంది రైతులకు రూ.62 లక్షల జమ

జిల్లావ్యాప్తంగా 4,588 మంది రైతులకు రూ.62.27 లక్షల సున్నా వడ్డీ పంట రుణం, పెట్టుబడి రాయితీ సోమవారం వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి తెలిపారు.

Published : 29 Nov 2022 01:18 IST

రైతులకు నమూనా చెక్కు అందిస్తున్నడీఆర్‌వో దయానిధి,

జిల్లా వ్యవసాయాధికారి నందు, జిల్లా ఉద్యానాధికారి రమేష్‌

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లావ్యాప్తంగా 4,588 మంది రైతులకు రూ.62.27 లక్షల సున్నా వడ్డీ పంట రుణం, పెట్టుబడి రాయితీ సోమవారం వారి ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి దయానిధి తెలిపారు. ముందుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీక్షించారు. అనంతరం డీఆర్‌వో, జిల్లా వ్యవసాయాధికారి నందు, జిల్లా ఉద్యానాధికారి రమేష్‌ చేతులమీదుగా లబ్ధిదారులకు నమూనా చెక్కు అందించారు. డీఆర్‌వో మాట్లాడుతూ జిల్లాలో 2020-21 రబీ కాలానికి సంబంధించి 669 మంది రైతులకు రూ.10.27 లక్షలు, 2021 ఖరీఫ్‌ కాలానికి సంబంధించి 1077 మంది రైతులకు రూ.19 లక్షలు, 2842 మంది రైతులకు సున్నా వడ్డీ రూ.33 లక్షలు జమ చేసినట్లు వివరించారు. సహాయ సంచాలకులు విజయ్‌కుమార్‌, ఎంవీ శ్రీనివాస్‌, రైతులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని