ఆగుతూ.. సాగుతూ..
అల్లూరి సీతారామరాజు జిల్లాకే తలమానికంగా నిలవనున్న వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. కళాశాల నిర్మాణంలో ఎదురవుతున్న బాలారిష్టాలను దాటుకుంటూ పనుల్లో వేగం పుంజుకుంది.
వైద్య కళాశాల పనుల తీరిది
లక్ష్యంలోగా పూర్తయ్యేలా కార్యాచరణ
పాడేరు, న్యూస్‌టుడే
నిర్మాణ దశలో ఉన్న ప్రధాన ఆసుపత్రి భవనం
అల్లూరి సీతారామరాజు జిల్లాకే తలమానికంగా నిలవనున్న వైద్య కళాశాల నిర్మాణ పనులు వేగం అందుకున్నాయి. కళాశాల నిర్మాణంలో ఎదురవుతున్న బాలారిష్టాలను దాటుకుంటూ పనుల్లో వేగం పుంజుకుంది. నిన్న మొన్నటి వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పాటు నిధులు సకాలంలో విడుదల కాకపోవడం వంటి సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పుడా పరిస్థితులను ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యం లోపే పనులు పూర్తి చేసేలా అడుగులు పడుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య కళాశాల నిర్మాణ పనులకు పలు రకాల అవరోధాలు ఎదురయ్యాయి. వైద్య కళాశాల నిర్మాణానికి 2021 జూన్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఇక్కడున్న వాతావరణ పరిస్థితులు నిర్మాణ పనులకు అనుకూలించలేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు స్థానికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు తట్టుకోలేక ఒప్పందం మధ్యలోనే స్వగ్రామాలకు తరలి వెళ్లిపోతుండేవారు. రోడ్డు, రవాణా సదుపాయాలు సక్రమంగా లేకపోవడంతో పెద్ద మొత్తంలో నిర్మాణ సామగ్రి తరలింపునకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే మొదటి దశలో చేపట్టిన పనులకు అప్పట్లో నిధులు సకాలంలో విడుదల చేయలేదు. దీంతో గుత్తేదారులు కొన్నాళ్ల పాటు పనులు మధ్యలోనే నిలిపివేశారు. ఇలాంటి అవాంతరాలను ఒక్కొక్కటి దాటుకుంటూ ప్రస్తుతం ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం లోపే వైద్య కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశా, బిహార్, ఝార్ఘండ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చారు. వారు నిరంతరం పనులు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు. వేర్వేరు ప్రాంతాల నుంచి నిర్మాణ సామగ్రిని సైట్ వద్ద తరలిస్తున్నారు. గతంలో పోలిస్తే ప్రభుత్వం సైతం చేసిన పనుల వరకు బిల్లులను విడుదల చేస్తూ రావడం వీరికి కలిసొచ్చింది. ఇప్పటికే ఆసుపత్రి ప్రధాన భవనం పనులు 30 శాతం వరకు పూర్తయ్యాయి. ఇతర విభాగాల పనులు అదే స్థాయిలో వేగం పుంజుకున్నాయి.
ఇతర విభాగాల పరిస్థితి ఇలా..
* వైద్య కళాశాల అంచనా విలువ: రూ.500 కోట్లు
* విస్తీర్ణం: 35.01 ఎకరాలు
* భవన నిర్మాణ విస్తీర్ణం: 13.39 లక్షల చదరపు అడుగులు
* అందుబాటులోకి రానున్న సీట్ల సంఖ్య: 100
* కళాశాలలో పడకల సామర్థ్యం: 500
* పనులు ప్రారంభమైంది: 26-06-2021
* నిర్మాణం పూర్తి కావాల్సిన లక్ష్యం: 24-12-2023
ఇతర విభాగాలు: శిక్షణ కేంద్రం, నర్సింగ్ కళాశాల, వైద్యుల గృహాలు, విద్యార్థులకు వసతి గృహాలు, స్టాఫ్ నర్సుల క్వార్టర్స్, జీవన వ్యర్థాల శుద్ధి కేంద్రం, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు, మందు నిల్వల కేంద్రం, శవాగారం.
అప్పట్లో అవాంతరాలు..: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వైద్య కళాశాలను మంజూరు చేసింది. అంతే స్థాయిలో పనులు ప్రారంభించినా కొంతకాలం తర్వాత కార్మికులు అందుబాటులో ఉండకపోవడంతో పాటు నిధుల విడుదలలో జాప్యం జరిగింది. దీంతో పనులు కొంత మందగించాయి. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. వేర్వేరు రాష్ట్రాల నుంచి సుమారు 500మంది వరకు కార్మికులను పనుల్లో పెట్టాం. సుమారు రూ.15 కోట్ల నిర్మాణ సామగ్రిని సిద్ధం చేశాం. చేసిన పనుల వరకూ బిల్లులు విడుదలవ్వడంతో పాటు వాతావరణం అనుకూలిస్తే వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తవుతుందనే నమ్మకం కలుగుతోంది.
- నాయుడు, కార్యనిర్వాహక ఇంజినీర్, ఏపీఎంఎస్‌ఐడీసీ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!
-
General News
KTR : హిండెన్‌బర్గ్ నివేదికపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు
-
India News
Child Marriage: మైనర్ బాలికతో వివాహం.. యావజ్జీవ కారాగార శిక్షే..!