గడప గడపకు.. వంద రోజులు పూర్తి
ప్రజా సంక్షేమ పథకాలతో పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే వైకాపా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు.
సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ
అరకులోయ, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమ పథకాలతో పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే వైకాపా ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. పద్మాపురం పంచాయతీ బొండంగుడ, పింపల్‌గుడ, శారద బొందుగుడ గ్రామాల్లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ నవరత్నాల కార్యక్రమంలో భాగంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో పేదలు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. లక్షకు పైగా అందించేలా వివిధ పథకాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని కుటుంబాలకు ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ఫాల్గుణ కేక్ కోసి పంచిపెట్టారు. వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mughal Gardens: మొఘల్ గార్డెన్స్.. ఇక ‘అమృత్ ఉద్యాన్’
-
Movies News
Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
-
World News
Kim Yo-jong: పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యా ముక్కలు చేస్తుంది..!
-
General News
Chandrababu: విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు, కుటుంబ సభ్యులు
-
Sports News
ABD: అంతర్జాతీయంగా ఉన్న సమస్య అదే.. షెడ్యూలింగ్‌పై దృష్టి పెట్టాలి: ఏబీడీ
-
Crime News
Viral news: విలేకరిపై అమానుషం.. చెట్టుకు కట్టి.. చితకబాది..!