logo

12,939 మంది విద్యార్థులకు రూ.5.13 కోట్ల జమ

జగనన్న విద్యా దీవెనలో భాగంగా జిల్లాలో 12,939 మంది విద్యార్థులకు రూ.5.13 కోట్లను జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు.

Published : 01 Dec 2022 03:17 IST

విద్యార్థుల తల్లులకు నమూనా చెక్కు అందజేస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: జగనన్న విద్యా దీవెనలో భాగంగా జిల్లాలో 12,939 మంది విద్యార్థులకు రూ.5.13 కోట్లను జమ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. బుధవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో విద్యాదీవెన ప్రారంభోత్సవ సభను నిర్వహించారు. ముందుగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలకు వెళ్లి ఫీజులు చెల్లించాలని సూచించారు. 97 శాతం మందికి నిధులు జమయ్యాయని, మూడు శాతం మందికి వివిధ కారణాలతో రాలేదని చెప్పారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి ప్రాధాన్యం ఇచ్చి అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, నాడు-నేడు తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. అనంతరం జగనన్న విద్యా దీవెన చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొండలరావు, డీఈఓ రమేష్‌, ఏటీడబ్ల్యూఓ ఎల్‌.రజని తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని