logo

మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు

మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పెదవలస వారపుసంతపై శుక్రవారం పోలీసులు నిఘా పెట్టారు.

Published : 03 Dec 2022 00:58 IST

పెదవలస సంతలో సీఐలు, సిబ్బంది తనిఖీలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో పెదవలస వారపుసంతపై శుక్రవారం పోలీసులు నిఘా పెట్టారు. సీఐలు అశోక్‌కుమార్‌, స్వామినాయుడు, సీఆర్పీఎఫ్‌ 234 బెటాలియన్‌ బి కంపెనీ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దేవేంద్రనాయుడు ఆధ్వర్యంలో సంత వద్ద పహారా కాశారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు సరిహద్దు కూడలిలో సీఆర్‌పీఎఫ్‌, సివిల్‌ పోలీసు బలగాలు తనిఖీలు చేపట్టాయి. సీలేరు ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో ఏవోబీలో తనిఖీలు నిర్వహించారు. సీలేరులో ఉన్న లాడ్జీలను పరిశీలించారు.

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: జడ్డంగి ఎస్సై షరీఫ్‌ ఆధ్వర్యంలో పూదేడు పరిసర ప్రాంతాల్లో ఏరియా డామినేషన్‌ చేశారు.

పెదబయలులో..

పెదబయలు గ్రామీణం, న్యూస్‌టుడే: పెదబయలు ఎస్సై మనోజ్‌కుమార్‌ ఆధ్వరంలో సరిహద్దుల్లో విస్తృతంగా వాహనాల తనిఖీలు చేశారు. మండల కేంద్రానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సంపంగిపుట్టు, సీతగుంట కూడలిలో తనిఖీలు చేశారు. మారుమూల ప్రాంతాల్లో రహదారి పనులకు సంబంధించిన పొక్లెయిన్లు, లారీలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు

నిలిచిన ఆర్టీసీ బస్సు సర్వీసులు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో మారుమూల ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపేశారు. గోకవరం నుంచి వై.రామవరం మండలం ఎగువ ప్రాంతంలోని గుర్తేడు, పాతకోటకు తిరిగే సర్వీసులు నిలిపేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని