logo

రహదారుల అభివృద్ధికి చర్యలు

మన్యంలో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌గనోరే పేర్కొన్నారు.

Published : 03 Dec 2022 00:58 IST

కానివాడ రోడ్డును పరిశీలిస్తున్న పీవో సూరజ్‌ గనోరే

మారేడుమిల్లి, వై.రామవరం, న్యూస్‌టుడే: మన్యంలో రహదారుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌గనోరే పేర్కొన్నారు. వై.రామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లే రహదారి దుస్థితిని శుక్రవారం ఆయన పరిశీలించారు. కానివాడ రహదారిని నిర్మించడానికి ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చావడికోట పంచాయతీ పరిధిలోని బంద ఆశ్రమ పాఠశాలను పీవో తనిఖీ చేశారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే తక్షణమే ఆసుపత్రులకు తరలించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని చెప్పారు. సర్పంచి శిల్పారాణి, పంచాయతీరాజ్‌ డీఈఈ రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని