logo

‘ఇచ్చేది గోరంత.. దోచేది కొండంత’

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో గోరంత ఇచ్చి కొండంత ప్రజాధనాన్ని దోచేస్తున్నారని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు.

Published : 04 Dec 2022 00:49 IST

గిరిజనులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, చల్లంగి జ్ఞానేశ్వరి, పూర్ణచంద్రరావు తదితరులు

చింతపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో గోరంత ఇచ్చి కొండంత ప్రజాధనాన్ని దోచేస్తున్నారని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. శనివారం కొత్తపాలెం, బెన్నవరం పంచాయతీల్లో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తెదేపా మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులంతా ఇంటింటా తిరిగి వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను వివరించారు. ఈశ్వరి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ తీరుతో నిరుపేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు అన్ని విధాలుగా నలిగిపోతున్నారన్నారు.  గిరిజనులకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం.. బిల్లులు చెల్లించాలంటూ గిరిజనులకు నోటీసులు ఇచ్చి వారి ఇళ్లకు కరెంటు సరఫరా తీసేస్తోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై ఏళ్లకే గిరిజనులకు పింఛన్లు మంజూరు చేశారని చెప్పారు. మళ్లీ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అసమర్థ వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలన్నారు. తెదేపా అరకు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి, క్లస్టరు బాధ్యులు పాంగి రాము, వంతల భీమన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని