logo

ప్రజా చైతన్యంతోనే వైకాపాకు గుణపాఠం

ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైకాపాకు గిరిజన ప్రజల చైతన్యంతో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

Published : 04 Dec 2022 00:49 IST

అరుకులో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న వైకాపాకు గిరిజన ప్రజల చైతన్యంతో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. అరుకు సంతబయలు గ్రామంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు తుడుము సుబ్బారావు, మాజీ సర్పంచి వెంకటరాజు ఆధ్వర్యాన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను గిరిజన కుటుంబాలకు వివరించారు. గిరిజన కుటుంబాలు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మూడున్నర ఏళ్ల వైకాపా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి గాలికి వదిలేశారని విమర్శించారు. ఎస్టీ సబ్‌ ప్లాన్‌తో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన ఘనత తెదేపా అధినేత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. వ్యవసాయం, గిరిజన సంక్షేమం, పీటీజీల అభివృద్ధికి ఊతమిచ్చిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. తెదేపా నేతలు నాగేశ్వరరావు, స్వామి,  ఆనందరావు, సుబ్బారావు,  సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని