logo

‘సమస్యల పరిష్కారంలో విఫలం’

తమ సమస్యలను పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు పది రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులకు పట్టకపోవడం దారుణమని అరకు పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి గడేసుల రంజిత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 04 Dec 2022 00:49 IST

కార్మికులకు సంఘీభావం తెలుపుతున్న తెలుగు యువత
అధికార ప్రతినిధి రంజిత్‌కుమార్‌, రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ

రంపచోడవరం, న్యూస్‌టుడే: తమ సమస్యలను పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట సత్యసాయి తాగునీటి పథకం కార్మికులు పది రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులకు పట్టకపోవడం దారుణమని అరకు పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి గడేసుల రంజిత్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ సత్యసాయి కార్మికుల సమస్యలను తెదేపా అగ్రనేతలు చంద్రబాబునాయుడు, లోకేష్‌ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చేవరకూ పార్టీ తరపున పోరాడుతామన్నారు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ శివరామకృష్ణ, కార్మికులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని