logo

బొండాంలో ఇసుక దందా

అరకులోయ మండలం బొండాం పంచాయతీ కొలియగుడ, జయంతివలస, రంపుడువలస, రేగ, కొత్తవలస, కరకవలస గ్రామాలకు ఆనుకుని ఉన్న గెడ్డ నుంచి సర్పంచి భాస్కరరావు అండదండలతో...

Published : 06 Dec 2022 01:34 IST

ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల వద్ద గిరిజన సంఘం నాయకులు, గ్రామస్థులు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ మండలం బొండాం పంచాయతీ కొలియగుడ, జయంతివలస, రంపుడువలస, రేగ, కొత్తవలస, కరకవలస గ్రామాలకు ఆనుకుని ఉన్న గెడ్డ నుంచి సర్పంచి భాస్కరరావు అండదండలతో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారని గిరిజన సంఘం నాయకులు బుజ్జిబాబు, టి జోషి ఆరోపించారు. ఇప్పటి వరకు ఆయా గ్రామాల ప్రజలు నిర్మాణ అవసరాలకు ఈ గెడ్డ నుంచి ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేవారని గుర్తుచేశారు. వానాకాలంలో కొట్టుకువచ్చి పేరుకున్న ఇసుకను ఇక్కడ గ్రామాల ప్రజల అవసరాలకు వినియోగించుకునేలా పరిరక్షించుకుంటన్నారని అన్నారు.  ప్రస్తుతం వార్డు సభ్యులు, స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా సన్పంచి ఇసుకను అమ్ముకోమని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని ఆరోపించారు. సర్పంచి నిర్ణయంతో ఇప్పుడు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. గ్రామం నుంచి వెళుతున్న ఇసుక ట్రాక్టర్లు వద్ద గ్రామస్థులతో కలసి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని