logo

వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.500 కోట్లు

జిల్లాలో ఈ ఏడాది రూ.500 కోట్లు వ్యవసాయ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 06 Dec 2022 01:34 IST

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలో ఈ ఏడాది రూ.500 కోట్లు వ్యవసాయ రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. ఇప్పటికి రూ.374 కోట్లు వరకు రైతులకు అందించారని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించాలన్నారు. వ్యవసాయ, పరిశ్రమలశాఖ, డీఆర్‌డీఏ అధికారులు, బ్యాంకర్లతో ఐటీడీఏ పీవో గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్‌ సోమవారం సమీక్షించారు. రిజర్వు బ్యాంకు అధికారి నాగప్రవీణ, ఎల్‌డీఎం రవితేజ, యూబీఐ ప్రాంతీయ సంచాలకులు సురేష్‌ రమేష్‌ పాల్గొన్నారు.

తాగునీటి పథకాల నిర్మాణాల్లో ఉప గుత్తేదార్ల ప్రమేయం ఉండరాదని కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో తాగునీటి పథకాల నిర్మాణం, పురోగతిపై ఆర్‌డబ్లూఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో సమీక్షించారు.

ఏడో తేదీన ఎలక్టోరల్‌ రోల్‌ అబ్జర్వర్‌ (పరిశీలకులు), ఐఏఎస్‌ అధికారి వి.బాబు జిల్లా కేంద్రం పాడేరులో పర్యటించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.
పాడేరు: మధ్యాహ్న భోజనం పథకం అమలుపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో మధ్యాహ్న భోజనం పథకం అమలు, వసతిగృహాల్లో విద్యార్థుల భద్రత, రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం ఎంఈవోలు, ఏటీడబ్ల్యూవోలతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు అందించాల్సిన పదార్థాలు బయట వ్యక్తులకు పెడితే ఉపేక్షించనన్నారు. డీఈవో రమేష్‌, గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని