logo

గిరిజన ప్రాంత అభివృద్ధే ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు.

Published : 06 Dec 2022 01:34 IST

గంగవరం, న్యూస్‌టుడే: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, గిరిజన ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. గంగవరం మండలం కుసుమరాయి, రాజంపాలెం, ఆముదాల బంద గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 23 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పలువురు మహిళలకు వైఎస్సార్‌ పోషణ కిట్లను అందజేశారు. గంగవరం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నాబార్డు నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాన్ని ప్రారంభించారు. ఇటీవల జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన బాలికలను ఎమ్మెల్యే అభినందించారు. ఎంపీపీ పల్లాల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు బేబీ రత్నం, వైస్‌ ఎంపీపీలు గంగాదేవి, రామతులసి, కోఆప్షన్‌ సభ్యుడు ప్రభాకర్‌, సర్పంచులు అక్కమ్మ, రాజులమ్మ పాల్గొన్నారు.


జగనన్న పాలనలో గడప గడపకు సంక్షేమం

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: జగనన్న పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమం మండలంలోని చొంపి పంచాయతీ గ్రామాల్లో రెండో రోజూ నిర్వహించారు. డెర్ని, కందమలివలస, గెమ్మెలి వలస గ్రామాల్లో ఆయన పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఎంపీపీ ఉషారాణి, సర్పంచి సుభద్ర, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ రమేష్‌, మండల పరిషత్‌ ఏఓ రాంబాబు, వార్డు సభ్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని