logo

జయపురం మహారాణి రమాదేవి కన్నుమూత

జయపురం చివరి మహారాణి రమాకుమారిదేవి (93) సోమవారం ఉదయం తన రాజభవనం మోతీ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు.

Updated : 03 Jan 2023 04:17 IST

రమాదేవి (పాత చిత్రం)

జయపురం, మాడుగుల, న్యూస్‌టుడే: జయపురం చివరి మహారాణి రమాకుమారిదేవి (93) సోమవారం ఉదయం తన రాజభవనం మోతీ ప్యాలెస్‌లో తుదిశ్వాస విడిచారు. మహారాజా విక్రమ్‌దేవ్‌ నాలుగో సోదరుడు రామకృష్ణచంద్ర దేవ్‌ భార్య అయిన రమాకుమారి దేవి 1962లో ఉమ్మడి విశాఖ జిల్లా వి.మాడుగుల నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.  1951-52 సమయంలో మోతీ ప్యాలెస్‌ (జయపురం) హవా మహల్‌ నిర్మించారు. ఈ మహల్‌ బాధ్యత పెద్ద కోడలు మయాంక్‌ దేవికి 2018లో అప్పజెప్పారు. రామకృష్ణ, రమాదేవికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమారులు హారాజ్‌ శక్తి విక్రమ్‌దేవ్‌, మహారాజ్‌ విభూత్‌ భూషణ్‌లు మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు చందన్‌వాడలోని రాజ శ్మశానంలో రాజసేవకుడు బినాయక్‌ స్వర్‌ చేతుల మీదుగా జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని