logo

నిధులిచ్చారు.. నిర్మాణం పూర్తిచేయరు

బూసిపుట్టు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.లక్షల వ్యయంతో నిర్మాణాలు.

Published : 20 Jan 2023 02:18 IST

బూసిపుట్టు పంచాయతీలో తాగునీటి ఎద్దడి

సంతవీధిలో అలంకారంగా మిగిలిన ట్యాంకు

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: బూసిపుట్టు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో తాగునీరు అందించాలనే లక్ష్యంతో రూ.లక్షల వ్యయంతో నిర్మాణాలు ప్రారంభించిన అధికారులు నాలుగేళ్లుగా అసంపూర్తిగా వదిలేశారు. ఫలితంగా నిధులు ఖర్చయినా గ్రామాల్లో రక్షిత తాగునీరు అందకుండా పోయింది.  
బూసిపుట్టు పంచాయతీ సంతవీధి గ్రామంలో రూ.8లక్షల అంచనా వ్యయంతో గ్రావిటీ నీటి పథకం నిర్మాణం చేపట్టారు. గ్రామంలో మూడు ప్రదేశాల్లో నీటి ట్యాంకులు నిర్మించారు. అయితే కొండ పైనుంచి ట్యాంకులకు నీటిని సరఫరా చేసేందుకు పైపులు అస్తవ్యస్తంగా అమర్చి, అసంపూర్తిగా వదిలేశారు. దీంతో నిధులు వృథా అయ్యాయి తప్ప, ప్రజలకు తాగునీటి కష్టాలు తీరలేదు. గ్రామంలోని 300 మంది గిరిజనులు రక్షిత మంచినీటి సదుపాయం లేక నేటికి మైళ్ల దూరం వెళ్లి కలుషిత కుండీ నీటిని వినియోగిస్తున్నారు.

బూసిపుట్టు గ్రామంలో కూడా ప్రజలు పొలంలోని ఊటనీరు వినియోగిస్తున్నారు. సరియాపల్లి, సుల్తాన్‌పుట్టు, కమ్మరిగొయ్యి గ్రామాల్లో ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. నిధులు కేటాయించిన అధికారులు పథకాల నిర్మాణాలు పూర్తి చేయించడంలో విఫలమవుతున్నారు. నీటి పథకాల నిర్మాణాలు పూర్తిచేసి రక్షిత తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రస్తుతం వినియోగిస్తున్న నీరు ఇదే..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని