logo

విశాఖ చేరిన ‘పుష్ప’

‘పుష్ప (ది రూల్‌)’ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు నటుడు అల్లు అర్జున్‌ గురువారం రాత్రి 10.00 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకున్నారు.

Updated : 20 Jan 2023 02:33 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ‘పుష్ప (ది రూల్‌)’ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు నటుడు అల్లు అర్జున్‌ గురువారం రాత్రి 10.00 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికి, స్వీయచిత్రాలు తీసుకునేందుకు పోటీపడ్డారు. అనంతరం ఆయన అభిమానులకు అభివాదం చేసి, ప్రత్యేక వాహనంలో నగరంలోకి వెళ్లారు. శుక్రవారం నుంచి విశాఖ పోర్టు, అరకు, మారేడుమిల్లి తదితర అటవీ ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణ ఉంటుందని అభిమానులు తెలిపారు.


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు