logo

జనరేటర్ల మరమ్మతులో జాప్యం ఎందుకు?

ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రాన్ని గురువారం ఏపీజెన్‌కో మానవ వనరుల విభాగం సంచాలకుడు (డైరక్టర్‌, హెచ్‌ఆర్‌) సయ్యిద్‌ రఫీ  సందర్శించారు.

Published : 20 Jan 2023 02:18 IST

వించ్‌హౌస్‌ వద్ద అధికారులు, ఉద్యోగులతో జెన్‌కో డైరెక్టర్‌

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రాన్ని గురువారం ఏపీజెన్‌కో మానవ వనరుల విభాగం సంచాలకుడు (డైరక్టర్‌, హెచ్‌ఆర్‌) సయ్యిద్‌ రఫీ  సందర్శించారు. విద్యుత్తు సౌధ నుంచి వచ్చిన ఈ ఉన్నతాధికారి వినియోగంలో ఉన్న, మరమ్మతులకు గురైన జనరేటర్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు.   మరమ్మతు పనులు చేయడంలో గుత్తేదారు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రాజెక్టులో కాంట్రాక్ట్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న ఆసుపత్రిని సందర్శించి అక్కడి వైద్యసేవలు, సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మందుల పంపిణీకి అదనపు నిదులు మంజురు చేయాలని కోరారు. స్థానిక ప్రాజెక్టు ఎస్‌ఈ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలు, ఇంజినీర్లతో సమావేశమయ్యారు. మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్కేంద్రంలో బదిలీ ప్రక్రియ సక్రమంగా అమలు కావడంలేదని, బదిలీ ఉత్తర్వులు వచ్చినా నలుగురు ఇంజినీర్లు ఏళ్లు తరబడి రిలీవింగ్‌కు వేచి ఉన్నారని అధికారి దృష్టికి తీసుకు వచ్చారు. నాలుగేళ్లకు ఒకసారి బదిలీ చేయాలని కోరారు. ప్రాజెక్టు కేంద్రంలో  గతంలో పార్కు నిర్మాణానికి నిధులు మంజూరైనా నేటికి కార్యరూపం దాల్చలేదన్నారు. ఆడిటోరియం నిర్మించాలని ఇంజినీర్లు కోరారు. ప్రాజెక్టులోని కార్మిక సంఘాలతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పరిధిలోని ఒనకఢిల్లీ, జోలాపుట్‌ జలాశయాల వద్ద సెక్యూరిటి గార్డులు తమకు సకాలంలో జీతాలు అందడంలేదని డైరక్టర్‌ దృష్టికి తీసుకు వచ్చారు. సయ్యిద్‌ రఫీతో పాటు డీజీఎం శ్రీనివాస్‌, మోతిగూడెం సీఈ కె.వేంకటేశ్వరరావు, మాచ్‌ఖండ్‌ ఎస్‌ఈ కె.వి.నాగేశ్వరరావు, ఈఈలు దుంగ రమణయ్య, ఆదిత్య సామంత్రాయ్‌ తదితరులు పాల్గొన్నారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని