logo

ఓట్లు వేసిన ప్రజలకే వెన్నుపోటు: కిడారి

రాష్ట్రంలో ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 21 Jan 2023 06:28 IST

చీకుమద్దెలలో శ్రావణ్‌కుమార్‌, తెదేపా నాయకుల నిరసన

హుకుంపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైకాపా ప్రభుత్వానికే దక్కిందని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. మండలంలోని చీకుమద్దెల,  గుమ్మడిగుంట, నందిపుట్టు, బొడ్డాపుట్టు గ్రామాల్లో శుక్రవారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి చిన్న విషయంలో వైకాపా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని పేర్కొన్నారు. తెదేపా హయాంలో దివంగత మాజీ ఎమ్మెల్యే సర్వేశ్వరరావు చీకుమద్దెల నుంచి డల్లాపల్లి మీదుగా గుమ్మడిగుంట వరకు మట్టి రోడ్డు ఏర్పాటు చేశారని, వైకాపా ప్రభుత్వం నాలుగేళ్లలో తారు రోడ్డు నిర్మించలేక పోయిందని పేర్కొన్నారు. పంచాయతీ, కొండల శివారు గ్రామాల్లో విద్యుత్తు లైట్లు కనిపిస్తున్నాయంటే నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు చూపిన చొరవ అన్నారు. తెదేపా నేతలు తులసీరావు, శెట్టి లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని