logo

జిల్లాకు మరో ‘అతిథి’ పంట

విభిన్న పంటల సాగుతో ఇప్పటికే గుర్తింపు పొందిన అల్లూరి జిల్లాకు మరో అతిథి పంట రాబోతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సబ్జా గింజల (చియా సీడ్స్‌) సాగుకు బెంగళూరుకు చెందిన లాజర్‌సన్‌ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్‌ ముందుకు వచ్చింది.

Published : 26 Jan 2023 02:26 IST

విత్తనాలను రైతులకు పంపిణీ చేస్తున్న అరుణతార ఎఫ్‌పీఓ సీఈఓ

శ్రీనివాసరావు, ప్రాజెక్ట్‌ సమన్వయకర్త ప్రసాద్‌

చింతపల్లి, న్యూస్‌టుడే: విభిన్న పంటల సాగుతో ఇప్పటికే గుర్తింపు పొందిన అల్లూరి జిల్లాకు మరో అతిథి పంట రాబోతోంది. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న సబ్జా గింజల (చియా సీడ్స్‌) సాగుకు బెంగళూరుకు చెందిన లాజర్‌సన్‌ టెక్నాలజీ ప్రైవేటు లిమిటెడ్‌ ముందుకు వచ్చింది. చింతపల్లి కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అరుణతార అనే రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఎంపిక చేసిన గిరిజన రైతుల ద్వారా వీటి సాగును ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టినట్టు ఎఫ్‌పీఓ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో భాగంగా బుధవారం కొందరు గిరిజన రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. జీకే వీధి, చింతపల్లి మండలాల్లోని సుమారు 500 మంది గిరిజన రైతులకు ఈ విత్తనాలను పంపిణీ చేస్తున్నామన్నారు. కేజీ విత్తనం ఖరీదు రూ.100గా ఉందన్నారు. ఎకరా విస్తీర్ణంలో ఈ పంట సాగు చేస్తే 350 నుంచి 450 కేజీల వరకు దిగుబడి వస్తుందని వివరించారు. రైతులు కేవలం వరికోతల అనంతరం ఖాళీగా ఉంచిన పొలాల్లో దుక్కి దున్ని విత్తనాలు చల్లితే చాలన్నారు. ఎరువులు వంటివి వేయనవసరం లేదని, పెట్టుబడులు అవసరం ఉండదని పేర్కొన్నారు. శీతల పానీయాలతోపాటు, వివిధ ఆహార పరిశ్రమలకు ఇవి ఎగుమతి చేయొచ్చన్నారు. ప్రాజెక్టు సమన్వయకర్త ప్రసాద్‌, ఎఫ్‌పీఓ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని