logo

భూములు ఇప్పించండి మహాప్రభో

రొంపల్లి పంచాయతీ పరిధిలోని చినకొనెల, బురుగు గ్రామాల్లో సుమారు 110 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయడానికి  ప్రయత్నిస్తున్నారని, అధికారులు అడ్డుకుని వాటిని తమకు అప్పగించాలని కోరుతూ గిరిజనులు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు.

Published : 27 Jan 2023 02:28 IST

బురుగలో పూలదండలతో గిరిజనుల నిరసన

బురుగలో గిరిజనుల వినూత్న నిరసన

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే:  రొంపల్లి పంచాయతీ పరిధిలోని చినకొనెల, బురుగు గ్రామాల్లో సుమారు 110 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయడానికి  ప్రయత్నిస్తున్నారని, అధికారులు అడ్డుకుని వాటిని తమకు అప్పగించాలని కోరుతూ గిరిజనులు గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. చినకొనెల, బురుగ గ్రామాల్లో సుమారు 52 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. తమ అధీనంలో ఉన్న భూమిని వ్యాపారుల పేరిట వెబ్‌ ల్యాండ్‌లో నమోదు చేశారని గిరిజనులు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టరు ఫిర్యాదు చేశామన్నారు. పాడేరు సబ్‌ కలెక్టర్‌ ఆయా గ్రామాలను సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బురుగలో పూల దండలతో వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామస్థులకు భూములు అప్పగించాలని వార్డు సభ్యుడు సోమెల అప్పలరాజు, స్థానికులు కోటపర్తి సింహాచలం, బురుగ పెంటయ్య రామారావు తదితరులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని