logo

ఆకట్టుకున్న కనకధార స్తోత్ర పారాయణ

పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం కనకధార స్తోత్ర పారాయణ కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది.

Published : 27 Jan 2023 02:28 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: పాతనగరంలోని బురుజుపేటలో కొలువైన కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం కనకధార స్తోత్ర పారాయణ కార్యక్రమం శాస్త్రోక్తంగా సాగింది. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కంచి పీఠానికి చెందిన స్వామీజీ శిష్యుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను నిర్వహించారు. దాదాపు 300 మంది మహిళలు పాల్గొని కనకధార స్తోత్రాలను పఠించారు. సాయంత్రం 6గంటల నుంచి 8గంటల వరకు ఇది కొనసాగింది. అనంతరం స్వామి అనుగ్రహ భాషణ చేశారు. తదుపరి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.శిరీషా, ఏఈఓ వి.రాంబాబు, పాలక మండలి ఛైర్మన్‌ కొల్లి సింహాచలం,  ధర్మకర్తలు బోదిలపాటి సత్యరూపవాణి, ఎస్‌.సతీష్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌.సుబ్రహ్మణ్యం, ఎస్‌.సురేష్‌, శంకరమఠం అధ్యక్షులు డాక్టర్‌ టి.రవిరాజు తదితరులు పాల్గొన్నారు.

గురువారం ఉదయం అమ్మవారికి లక్ష తులసి దళాలతో పూజాధికాలు నిర్వహించారు. పలువురు ఉభయదాతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేవాదాయ శాఖ సంయుక్త కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ గురువారం సాయంత్రం అమ్మవారి ఆలయానికి వచ్చి పూజలు చేశారు. సంయుక్త కమిషనర్‌కు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని