logo

నాయుడుబాబు ప్రోత్సాహంతో పార్లమెంట్‌కు వెళ్లా: అయ్యన్న

తెదేపాలో తనకు సలహాలిస్తూ నాయకత్వ లక్షణాలు పెంపొందేలా నాగిరెడ్డి వెంకటరమణ (నాయుడుబాబు) భుజం తట్టి ప్రోత్సహించారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.

Published : 27 Jan 2023 02:28 IST

అడ్డూరులో నాయుడుబాబు విగ్రహాన్ని అవిష్కరిస్తున్న మాజీ మంత్రి అయ్యన్న,  
మాజీ ఎమ్మెల్యేలు చలపతిరావు, రాజు

చోడవరం, న్యూస్‌టుడే: తెదేపాలో తనకు సలహాలిస్తూ నాయకత్వ లక్షణాలు పెంపొందేలా నాగిరెడ్డి వెంకటరమణ (నాయుడుబాబు) భుజం తట్టి ప్రోత్సహించారని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. చోడవరం మండలం అడ్డూరులో నాయుడుబాబు విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ.. అప్పట్లో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానానికి తెదేపా అధిష్ఠానం తనను ఎంపిక చేస్తే.. ఆసక్తి చూపలేదన్నారు. ఆ సమయంలో నాయుడుబాబు ప్రోత్సహించి నీలాంటి వారు పార్లమెంట్‌కు వెళ్లాలని చెప్పారని నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. నాగిరెడ్డి వెంకటరమణ కంటే అడ్డూరు నాయుడుబాబుగానే ఆయన సుపరిచితులని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే పప్పల చలపతిరావు, మాజీ ఎమ్మెల్యేలు కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు పీలా గోవింద, నాయకులు తైనాల విజయకుమార్‌, బత్తుల తాతయ్యబాబు, గూనూరు మల్లునాయుడు, కోటేశ్వరరావు, బొడ్డేడ గంగాధర్‌, సర్పంచి అప్పలనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని