logo

రైతులకిచ్చిన హామీలు ఏమాయె?

ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పట్టణంలో రైతుసంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ట్రాక్టర్‌, స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు.

Published : 27 Jan 2023 02:28 IST

ట్రాక్టర్‌ ర్యాలీలో రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు

లక్ష్మీదేవిపేట (అనకాపల్లి), న్యూస్‌టుడే: ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం పట్టణంలో రైతుసంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ట్రాక్టర్‌, స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీ మొదలై ఆర్టీసీ కాంప్లెక్సు, నెహ్రూచౌక్‌ కూడలి, రామచంద్ర థియేటర్‌, అండర్‌ బ్రిడ్జి, రింగురోడ్డు మీదుగా ర్యాలీ సాగింది. నెహ్రూచౌక్‌ కూడలిలో రైతుల సమస్యలపై నినాదాలు చేశారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడుతూ రైతులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలన్నారు. విద్యుత్తు సంస్కరణ బిల్లు 2020 రద్దు చేయాలన్నారు. పాల ఉత్పత్తిదారులకు మద్దతు ధరగా లీటరుకు రూ. 10 అదనంగా ఇవ్వాలన్నారు. 60 ఏళ్లు నిండిన ప్రతి రైతులకు నెలకు రూ. 5 వేలు పింఛను ఇవ్వాలన్నారు. ఏప్రిల్‌ 5న దిల్లీలో జరిగే రైతు కార్మిక వ్యవసాయ కూలీల మహా ప్రదర్శనను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘాల సమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని