logo

‘యువగళం’తో వైకాపాలో వణుకు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం కుప్పంలో యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు.

Published : 28 Jan 2023 03:23 IST

చింతాలమ్మ తల్లికి పూజలు చేస్తున్న తెదేపా మహిళా నేతలు

కొయ్యూరు, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం కుప్పంలో యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. దీనికి మద్దతుగా జిల్లాలోని పలుచోట్ల తెదేపా నేతలు పాదయాత్రలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. లోకేశ్‌ పాదయాత్రతో వైకాపా వెన్నులో భయం పట్టుకొందని తెదేపా నేతలు విమర్శించారు. టీఎన్‌టీయూ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఎ.చిరంజీవి ఆధ్వర్యంలో కొయ్యూరు మల్లికార్జునస్వామి, దుర్గాదేవి ఆలయాల్లో తెదేపా నేత బి.శివరామరాజు, సర్పంచులు బాలరాజు, సింహాచలం, లక్ష్మి 101 కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పాదయాత్ర విజయవంతం కావాలని ప్రార్థించారు. మండల తెదేపా మహిళా అధ్యక్షురాలు బోనంగి సత్యవతి, నాయకురాలు ఏలూరి రత్నం, వరలక్ష్మి, రమణమ్మ తదితరులు చింతాలమ్మ తల్లికి పూజలు చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దొరబాబు, ఎస్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి రామ్మూర్తి, నాయకులు వరహాలబాబు, సన్యాసిరావు తదితరులు ఆంజనేయస్వామికి పూజలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు