logo

స్తంభాలు వేయమంటే.. సరఫరా తీసేశారు!

అరకులోయ మండలం మాదల పంచాయతీ హుద్‌హుద్‌ మోడల్‌ కాలనీలో విద్యుత్తు తీగల ఏర్పాటుకు కర్రల స్థానంలో స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరితే సమస్యను పరిష్కరించకుండా పూర్తిగా సరఫరా నిలిపివేయడం సరికాదని గిరిజన సంఘం మండల కార్యదర్శి రామన్న, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 28 Jan 2023 03:23 IST

అరకులోయలో విద్యుత్తు సంస్థ ఏఈకి వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్థులు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: అరకులోయ మండలం మాదల పంచాయతీ హుద్‌హుద్‌ మోడల్‌ కాలనీలో విద్యుత్తు తీగల ఏర్పాటుకు కర్రల స్థానంలో స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరితే సమస్యను పరిష్కరించకుండా పూర్తిగా సరఫరా నిలిపివేయడం సరికాదని గిరిజన సంఘం మండల కార్యదర్శి రామన్న, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన సంఘం ఆధ్వర్యంలో మోడల్‌ కాలనీ గ్రామాల గిరిజనులు విద్యుత్తు స్తంభాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అరకులోయ విద్యుత్తు ఉపకేంద్రం అధికారులకు వినతిపత్రం అందజేశారు. 2014లో ఈ కాలనీ ఏర్పాటైంది. విద్యుత్తు సదుపాయం కల్పించాలని కొన్నేళ్లుగా అధికారులు, ప్రజా ప్రతినిధులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో కర్రల సహాయంతో తీగలను ఏర్పాటు చేసుకున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఈ సమస్యపై వినతిపత్రం అందజేశామన్నారు. సమస్య పరిష్కరించక పోగా, అనుమతి లేకుండా విద్యుత్తు తీగలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పి గురువారం సిబ్బంది కాలనీకి సరఫరా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుండా అధికార పార్టీ రాజకీయం చేస్తోందని గిరిజన సంఘం మండల కార్యదర్శి రామన్న ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సంఘం పంచాయతీ నాయకులు చందు, అప్పారావు, రూప, కల్యాణ్‌, సుబ్బారావు, బాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని