logo

15 లక్షల విలువైన గంజాయి పట్టివేత

వ్యానులో తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 500 కిలోల గంజాయిని శుక్రవారం సాయంత్రం పట్టుకున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపారు.

Published : 28 Jan 2023 03:23 IST

గంజాయి, నిందితులతో మోతుగూడెం పోలీసులు

మోతుగూడెం, న్యూస్‌టుడే: వ్యానులో తరలిస్తున్న రూ.15 లక్షల విలువైన 500 కిలోల గంజాయిని శుక్రవారం సాయంత్రం పట్టుకున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం ఎస్సై వాసంశెట్టి సత్తిబాబు తెలిపారు. గొడ్లగూడెం కూడలి వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడింది. చింతూరు మండలంలోని సుకుమామిడి నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు ఈ గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు. గంజాయి తరలిస్తున్న కర్ణాటకు చెందిన బనదీష్‌(35), మహారాష్ట్రకు చెందిన సంతోష్‌ సంజాయ్‌ జాదవ్‌(23)ను అరెస్టు చేశామన్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. నిందితుల నుంచి వ్యాన్‌, గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో ఏఎస్సై పట్టాభిరామయ్య, హెడ్‌ కానిస్టేబుళ్లు రాజేశ్వరరావు, సత్తిబాబు, కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, సన్యాసిరావు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని