logo

బొండా ఘాట్‌లో జటి పండగ

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్‌లోని ఆన్‌డ్రహాల్‌ గ్రామంలో జరిగే కొట్టుకునే పండగ (జటి పండగ)కు ఓ ప్రత్యేకత ఉంది.

Published : 28 Jan 2023 03:23 IST

పండగలో యువకులు..

ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్‌లోని ఆన్‌డ్రహాల్‌ గ్రామంలో జరిగే కొట్టుకునే పండగ (జటి పండగ)కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ గ్రామాల్లో నివసించే ఆదిమజాతి గిరిజనుల వేషాధారణ, సంప్రదాయాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ పండగకు సరిహద్దులోని ఆన్‌డ్రహాల్‌ గ్రామం వేదిక అయింది. శుక్రవారం మొదట గ్రామానికి చెందిన పూజారి ఇంట్లో ప్రత్యేక పూజలు జరిపిన తరువాత మేళతాలలోలో గ్రామానికి చెందిన రచ్చబండ వద్దకు వచ్చి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. నేటి ఆధునిక యుగంలో కూడ బోండా గిరిజనులు తమ సంప్రదాయాలను తూచ తప్పకుండా పాటించడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని