ప్రభుత్వ ప్రోత్సాహం అంతంతే.. దాతల సాయమూ అంతంతే
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హాకీ క్రీడకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. దాతల సాయం అంతంతమాత్రమే. నేర్చుకుందామని ఆసక్తి ఉన్నా పూర్తిస్థాయిలో కోచ్‌లు లేరు.
జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేయాలి
హాకీ జిల్లా జట్ల కెప్టెన్ల మనోగతం
పోటీల ప్రారంభోత్సవంలో కలెక్టర్ రవికి స్వాగతం
ఎలమంచిలి, న్యూస్‌టుడే: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హాకీ క్రీడకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. దాతల సాయం అంతంతమాత్రమే. నేర్చుకుందామని ఆసక్తి ఉన్నా పూర్తిస్థాయిలో కోచ్‌లు లేరు. రోజూ సాధన చేద్దామంటే పరికరాలు అందుబాటులో లేవు. రాష్ట్రస్థాయిలో పోటీల్లో పాల్గొనాలంటే సొంత ఖర్చులతో వెళ్లాల్సి వస్తోంది. కష్టాలు ఎన్ని ఉన్నా జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేస్తే క్రీడాకారులకు బాగుంటుందని రాష్ట్రంలోని హాకీ జట్ల కెప్టెన్లు అభిప్రాయపడుతున్నారు. ఎలమంచిలి పట్టణంలో అంతర్ జిల్లాల జూనియర్ మహిళా హాకీ పోటీలను శనివారం కలెక్టర్ రవి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన జట్ల కెప్టెన్లు మనోగతాలు ‘న్యూస్‌టుడే’కి వివరించారు.
మైదానాలు కరవే.. : క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేయడానికి చాలా జిల్లాల్లో సరైన మైదానాలు లేవు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా క్రీడా మైదానాలు ఏర్పాటుచేయాలి. అలా చేస్తే వారాంతం రోజు అయినా అక్కడికి వెళ్లి ఆటలు ఆడతారు. అలా క్రీడలపై గ్రామీణులకు ఆసక్తి పెరుగుతుంది. మండలానికో ఒక కోచ్‌ను నియమించాలి. అప్పుడే క్రీడారంగానికి గుర్తింపు ఉంటుంది.
జి.వరలక్ష్మి, కాకినాడ జిల్లా
ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే క్రీడాకారులకు ప్రభుత్వం ఉచిత రైలు ప్రయాణ సౌకర్యం కల్పించాలి. చాలామంది క్రీడాకారులు రవాణా ఛార్జీలు సైతం పెట్టుకోలేక పోటీలకు హాజరుకావడం లేదు. ఎక్కడ పోటీలు జరిగినా క్రీడాకారులు రైలు జనరల్ బోగీల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
గొల్ల జయశ్రీ ఎన్టీఆర్ జిల్లా
సీనియర్లకు కోచ్‌లుగా అవకాశం
గ్రామాల్లో చాలా మందికి హాకీ క్రీడ నేర్చుకోవాలని ఉంటుంది. అయితే వీరి శిక్షణ ఇవ్వడానికి శిక్షకులు లేరు. ప్రతి మండలానికి, నియోజకవర్గానికి ఒక కోచ్‌ను నియమించాలి. ఇలా చేస్తే సీనియర్ క్రీడాకారులకు కోచ్‌లుగా అవకాశం దక్కుతుంది.
పి.లావణ్య, గుంటూరు జిల్లా
అకాడమీ ఏర్పాటుతోనే మేలు
క్రీడాకారులకు ఆటల్లో మంచి శిక్ష ఇచ్చి వారిని ప్రోత్సహించడానికి జిల్లాకో అకాడమీ ఏర్పాటు చేయాలి. అప్పుడే క్రీడాకారులు చక్కగా నేర్చుకోగలరు. నిపుణులైన కోచ్‌లు శిక్షణ ఇవ్వడం వల్ల ఆటలో మెలకువలు నేర్చుకుంటారు. క్రీడాకారులకు జాతీయ స్థాయిలో సత్తాచాటేలా తయారవ్వాలంటే అకాడమీ అవసరం. అక్కడ మంచి ఆహారం ఇస్తారు. చక్కగా నేర్పుతారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.
ఎస్.కల్యాణి, కెప్టెన్, విశాఖ జిల్లా జట్టు
సామగ్రి ఉచితంగా ఇస్తే సాధన
క్రీడాకారులకు ప్రభుత్వం ఉచితంగా క్రీడా సామగ్రి సరఫరా చేయాలి. మార్కెట్‌లో వీటి ధరలు బాగా పెరిగిపోయాయి. ప్రతి పాఠశాలను, కళాశాలను యూనిట్‌గా తీసుకుని పరికరాలు అందించాలి.
ఎం.లలిత, ప్రకాశం జిల్లా
ఎనిమిది సార్లు జాతీయస్థాయిలో ఆడాను
రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఎనిమిది సార్లు హాకీ నేషనల్స్ ఆడాను. ఆరేళ్లుగా ప్రత్యేక సాధన చేస్తున్నాను. క్రికెట్‌కి ఉదారంగా సాయం చేసినట్లు హాకీకి సాయం అందించడానికి దాతలు ముందుకు రావడం లేదు.
టి.యువరాణి, తిరుపతి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Rishi Sunak: ఇంగ్లాండ్ ఆటగాళ్లతో క్రికెట్ ఆడిన రిషిసునాక్.. వీడియో వైరల్
-
India News
America: అశ్లీల వీడియోలు సరఫరా.. భారతీయుడికి 188 నెలల జైలు..!
-
Movies News
Dasara: ‘దసరా’ సెన్సార్ రిపోర్టు.. మొత్తం ఎన్ని కట్స్ అంటే?
-
India News
Jaishankar: ‘దౌత్యవేత్తలకు భద్రత కల్పించడంలో బ్రిటన్ విఫలం..!’
-
General News
Hyderabad: ఎల్బీనగర్లో అందుబాటులోకి మరో కొత్త ఫ్లైఓవర్
-
India News
Raghav Chadha: రాఘవ్ చద్దా, పరిణీతి డేటింగ్ రూమర్స్.. ఎంపీ సమాధానమిదే..!