logo

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ఆశ్రమ పాఠశాలల్లో మెనూ అమల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు అన్నారు.

Published : 29 Jan 2023 03:19 IST

జాముగుడలో భోజన పదార్థాలు పరిశీలిస్తున్న ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: ఆశ్రమ పాఠశాలల్లో మెనూ అమల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఏటీడబ్ల్యూవో మల్లికార్జునరావు అన్నారు. కొర్రాయి పంచాయతీ జాముగుడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో శనివారం ఆయన భోజన మెనూ పరిశీలించారు. ప్రధానోపాధ్యాయిని విద్యార్థులను కర్రతో కొట్టడంపై విచారణ చేపట్టారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. మెనూ పక్కాగా అమలయ్యేలా చూస్తామని చెప్పారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రధానోపాధ్యాయిని సుజాత పాల్గొన్నారు.


శతశాతం ఉత్తీర్ణతకు కృషి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పది విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏటీడబ్ల్యూవో జయనాగలక్ష్మి అన్నారు. శనివారం పెదబరడ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన సందర్శించారు. పది విద్యార్థులకు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఆమె మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. మెనూలో నాణ్యత పాటించాలని, పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ప్రధానోపాధ్యాయుడు బాలన్న, ఉపాధ్యాయులు రాంప్రసాద్‌, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని