logo

చిరుధాన్యాల సాగుతో అధిక ఆదాయం

చిరుధాన్యాల సాగుని చేపట్టటం ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు చిన్నయ్యదొర అన్నారు.

Published : 01 Feb 2023 02:01 IST

మాట్లాడుతున్న ఏడీ చిన్నయ్యదొర

అరకులోయ, న్యూస్‌టుడే: చిరుధాన్యాల సాగుని చేపట్టటం ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని పొందవచ్చని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు చిన్నయ్యదొర అన్నారు. చినలబుడు పంచాయతీ తుడుంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. రాగులు, సామలు, గంట్లు, ఊదలు వంటి పంటలకు మన్యం అనుకూలమన్నారు. చిరుధాన్యాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందన్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకుని ఆ పంటలు పండించి అధిక ఆదాయాన్ని పొందాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని