logo

పర్యావరణ హితంగా బొర్రాగుహలు

పర్యావరణ హితంగా బొర్రాగుహలను తీర్చి దిద్దుతామని డీఎల్‌పీఓ కుమార్‌ అన్నారు. బొర్రా, కొత్తూరు సచివాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు.

Published : 01 Feb 2023 02:01 IST

బొర్రా సచివాలయంలో మాట్లాడుతున్న డీఎల్‌పీఓ కుమార్‌

అనంతగిరి, న్యూస్‌టుడే: పర్యావరణ హితంగా బొర్రాగుహలను తీర్చి దిద్దుతామని డీఎల్‌పీఓ కుమార్‌ అన్నారు. బొర్రా, కొత్తూరు సచివాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా బొర్రాగుహలు వద్దకు లివింగ్‌ వాటర్‌ ఇండియా సంస్థ ప్రతినిధులతో కలిసి వెళ్లారు. పంచాయతీ సిబ్బంది, స్థానికులతో ఆయన మాట్లాడారు. లివింగ్‌ వాటర్‌ ఇండియా సంస్థ  ద్వారా గుహలను పర్యవరణ హితంగా తయారు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్లాష్టిక్‌ వ్యర్ధాలు గుహలు వద్ద కనిపించకుండా ఉండేలా ఈ సంస్థ ప్రతినిధులు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా చెప్పారు. స్థానికులు సహకరించాలని కోరారు. సంస్థ డైరెక్టర్‌ డేవిడ్‌ కార్బన్‌ ఉద్గార వలన గుహలుకు జరిగే నష్టం దాని పరిష్కార మార్గాలను వివరించారు. కొత్తూరులో రికార్డులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. బొర్రా, కొత్తూరు సర్పంచులు అప్పారావు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని