logo

డీఆర్‌వోగా అంబేడ్కర్‌

జిల్లా రెవెన్యూ అధికారిగా చింతూరు యూనిట్‌-1 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న అంబేడ్కర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు.

Published : 01 Feb 2023 02:01 IST

మంగళ వారం పాడేరులో జిల్లా రెవెన్యూ శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన అంబేడ్కర్‌

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లా రెవెన్యూ అధికారిగా చింతూరు యూనిట్‌-1 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న అంబేడ్కర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) అప్పగించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్‌లో ముంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాద పూర్వకంగా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ను కలిశారు. ప్రస్తుతం డీఆర్‌వోగా పని చేస్తున్న దయానిధి వ్యక్తిగత కారణాలతో ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో చింతూరు యూనిట్‌-1 డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న అంబేడ్కర్‌కు డీఆర్వోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో అనకాపల్లి జిల్లా రోలుగుంట తహసీల్దార్‌గా పనిచేస్తున్న ఈయనకు ఇటీవల డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పించారు. ఆ హోదాలో చింతూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో యూనిట్‌-1కు పోస్టింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే జిల్లా చింతపల్లి తహసీల్దార్‌గానూ పని చేసిన అనుభవం ఈయనకు ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని