logo

పాఠ్య ప్రణాళిక లేకుండా బోధనా?

ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ఎంతో శ్రద్ధ వహిస్తుంటే దానిని అమలుచేయడంలో నిర్లక్ష్యం తగదని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 04:23 IST

డీఈవో ఆగ్రహం
ఉపాధ్యాయులకు షోకాజ్‌

విద్యార్థుల పుస్తకాలు పరిశీలిస్తున్న అధికారులు

పెదబయలు, న్యూస్‌టుడే: ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ఎంతో శ్రద్ధ వహిస్తుంటే దానిని అమలుచేయడంలో నిర్లక్ష్యం తగదని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన మండలంలో మండలంలోని పలు పాఠశాలలను తనిఖీ చేశారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల నోట్‌ పుస్తకాలు పరిశీలించి పదాలు చదివించారు. బోర్డుపై పలు పదాలు రాసి విద్యార్థులచే వాటిని చదివించారు. పెదబయలు ఆశ్రమోన్నత బాలురు, బాలికల 1, 2, పాఠశాలలు, సీతగుంట ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ, తురకలవలస పాఠశాలల్లో ఉపాధ్యాయుల పాఠ్య ప్రణాళికలు పరిశీలించారు. వాటిని సక్రమంగా రాయకపోవడం, పర్యవేక్షించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనికి సంబంధించి జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, సైన్సు ఉపాధ్యాయుడు, ఆశ్రమోన్నత బాలుర పాఠశాల హెచ్‌ఎంతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులందరికి షోకాజ్‌లు జారీచేశారు. నిత్యం తనిఖీలు చేస్తానని, ఇకపై నిర్లక్ష్యం వహిస్తే సహించేదని లేదని హెచ్చరించారు. ఆయన వెంట ఎంఈఓ కె.సింహాచలం తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని